మంచిర్యాల (అక్షరవేకువ) అక్టోబర్ 07
పార్టీ నాయకులపై క్రమశిక్షణ రాయితీతో ప్రెస్ మీట్లు పెడుతూ, బాధ్యతలో ఉన్న పార్టీని దూషిస్తే ప్రత్యక్షంగా పార్టీకి నష్టం కలిగినట్లుగా భావించడం జరుగుతుందని ఆయన తెలిపారు
పార్టీ లైన్ దాటితే వేటు తప్పదని భారతీయ జనతా పార్టీ జిల్లా ఇన్చార్జ్ కన్నెబోయిన ఓదెలు బుధవారం పత్రికా సమావేశంలో వెల్లడించారు. పార్టీ నాయకులపై క్రమశిక్షణ రాయితీతో ప్రెస్ మీట్లు పెడుతూ, బాధ్యతలో ఉన్న పార్టీని దూషిస్తే ప్రత్యక్షంగా పార్టీకి నష్టం కలిగినట్లుగా భావించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇదివరకే కొందరిని సస్పెండ్ చేశామని, ఇలాగే జరిగితే చట్టరీత్యా కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కొందరు సీనియర్ల పేరిట బాధ్యత పదవుల్లో ఉన్నవారిని దూషణ చేస్తే తగిన చర్యలు ఉంటాయని పార్టీ అంతర్గత విభేదాలు అధిష్టానానికి ఫిర్యాదు చేయాలి తప్ప వ్యక్తిగత ప్రెస్ మీట్ లు పెట్టడం సరికాదని పద్ధతి మార్చుకో పోతే తీవ్రస్థాయిలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు.












