మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 14
ొడఅడషటవూఅీటీఅథఅశూీఆఎటటడఖషడడఎీఈటవఖవీీఅడ,ూీఆఎ,టీీీషటవఅశఅ.షడడ,ఎీఈటవఖొఆొ.
సింగరేణి భరోసా యాత్రతో కార్మికులకు బీజేపీ బలాన్నిచ్చిందని, మోసపూరిత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను కార్మికులు పక్కన పెట్టడం ఖాయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, చెన్నూరు అసెంబ్లీ పోటీ అభ్యర్థి దుర్గం అశోక్ స్పష్టం చేశారు. మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు కార్మికులకు కొండంత అండగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.
మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ సింగరేణిలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను భరోసా యాత్రలో కార్మికులకు ముఖాముఖిగా వివరించారని దుర్గం అశోక్ తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 26 వేల కోట్ల అప్పు చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 30 వేల కోట్ల అప్పు చేసి సింగరేణి కార్మికుల జీతాలకు ఇబ్బంది కలిగించే పరిస్థితి తెచ్చిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలైన ఇళ్ల స్థలాల కేటాయింపు, వేతనాల పెంపు, కారుణ్య ఉద్యోగాలు, లాభాల బోనస్లో సమాంతర వాటా వంటివన్నీ తప్పిందని, ప్రస్తుతం ఇళ్ల స్థలాలు సైతం కేటాయించకపోవడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు. బోర్డు ఏర్పాటుతో 2 వేల కారుణ్య ఉద్యోగాలకు 335 కాగితాలు ఇచ్చి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
జైపూర్ పవర్ ప్లాంట్లో రాష్ట్ర కార్మికులకు వేతనాలు తక్కువగా చెల్లిస్తున్నారని, ఇతర రాష్ట్రాల కార్మికులకు అధిక వేతనాలు చెల్లిస్తున్న మంత్రి వివేక్ చోద్యం చూడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎంపీ వంశీ సింగరేణి కార్మికుల కోసం మాటలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. మంచిర్యాల జిల్లాలో పనిచేసే సింగరేణి కార్మికుల ఔట్ సోర్సింగ్ వేతనం రూ.20 వేలు ఉండగా, ఇతర ప్రాంతాల్లో రూ.25 వేలు ఉందని, వెంటనే ఆ కార్మికులకు వేతనాల పెంపు ఎంపీ వంశీ బాధ్యత అని వెల్లడించారు.
చెన్నూరు అసెంబ్లీ పరిధిలోని ఎమ్మెన్నార్ గార్డెన్లో జరిగిన సింగరేణి భరోసా మీటింగ్కు పెద్ద ఎత్తున కార్మికులు తరలివచ్చి బీజేపీకి తమ మద్దతు తెలిపారని దుర్గం అశోక్ తెలిపారు. సింగరేణి కార్మికులకు ఎలాంటి సమస్యలు వచ్చినా వారి వెంట ఉద్యమ బాటలో పోరాటం చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సెగ్మెంట్ పరిధిలో సింగరేణి కార్మికుల రక్షణ కవచంగా బీజేపీ ఉంటుందని, సమస్యలను తమ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా ముందుకు సాగుతామని ఆయన వెల్లడించారు.
జైపూర్, భీమారం, రామకృష్ణాపూర్, మందమర్రి ఏరియాల నుంచి తరలివచ్చిన బీజేపీ శ్రేణులకు, సింగరేణి కార్మికులకు, వారి కుటుంబాలకు అశోక్ ధన్యవాదాలు తెలిపారు.











