మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 27
మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా సుధాముల్లా హరికృష్ణ నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, యువతను, నాయకులను పార్టీ వైపు ఆకర్షించడం, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును లక్ష మెజార్టీతో గెలిపించడం లక్ష్యంగా పనిచేస్తామని ఆయన తెలిపారు.
మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా సుధాముల్లా హరికృష్ణ నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీని మంచిర్యాలలో పూర్తిస్థాయిలో బలపరిచి, యువతను, నాయకులను అధిక సంఖ్యలో కాంగ్రెస్ కు అనుకూలంగా చేయడం తో పాటు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే పిఎస్ ఆర్ ను లక్ష మెజార్టీతో గెలిపించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేతలు, నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూ, కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా కదులుతామని హరికృష్ణ అన్నారు. తనపై నమ్మకంతో ఎస్సీ నేతగా పదవి అప్పగించినందుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు, మాజీ జిల్లా అధ్యక్షురాలు సురేఖమ్మకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
సిటీ అధ్యక్షుడు తూముల నరేష్, నగర మేయర్ మధుకర్ తో కలిసి హస్తం పార్టీని ప్రజల చెంతకు చేర్చడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని హరి వెల్లడించారు.












