మైనార్టీ (అక్షరవేకువ) నవంబర్ 21
మండలంలోని తాళ్లపేట గ్రామంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ జన్మదిన వేడుకలను ఆకుల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.
అనంతరం ఆకుల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే నాయకురాలిగా కొక్కిరాల సురేఖమ్మకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ డైరెక్టర్ కనక జంగు పటేల్, మైనార్టీ మండల అధ్యక్షుడు నిహాల్ ఖాన్, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆకుల రామయ్య, సందేల తిరుపతి, సందని, మాజీ ఉపసర్పంచ్ దేవ లక్ష్మణ్, గోపతి లక్ష్మయ్య, జంగు, మన్సూర్, మర్రిపెల్లి సత్తయ్య, కుందరపు శ్రీనివాస్, వెలమల అర్జయ్య, బత్తుల శ్రీనివాస్, గేడెం మధు, ఆనంద్, శివ, గణేష్, యూత్ అధ్యక్షుడు దుర్గం రవీందర్, మాదిగ సంఘం అధ్యక్షుడు జిల్లపెల్లి వినయ్ రాజ్, గ్రామ మైనార్టీ యూత్ అధ్యక్షుడు షోహెల్ ఖాన్, బుద్దె బానేష్, మలేం రాకేష్, సందేల వంశీ, వార్డు సభ్యుడు పున్నం చంద్, ఇజార్ ఖాన్, షబ్బీర్, ఈర్ల రాజేందర్, రాజేందర్ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.







