మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘునాథరెడ్డి తెలిపారు. ఆదివారం రామకృష్ణాపూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రఘునాథరెడ్డి, జిల్లా మాజీ అధికార ప్రతినిధి ఉడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ 2008లో రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిందని, అయితే లోక్ సభలో తగిన మెజార్టీ లేకపోవడంతో అది ఆమోదం పొందలేదని వారు గుర్తు చేశారు.
మహిళల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ చిత్తశుద్ధితో పోరాడుతుందని రఘునాథరెడ్డి పేర్కొన్నారు. దేశంలో మొదటి మహిళా ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్, హోంమంత్రి వంటి కీలక పదవులను కాంగ్రెస్ ప్రభుత్వాలే మహిళలకు కల్పించాయని ఆయన తెలిపారు.
మహిళల సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుండి నేటి వరకు పోరాడుతూనే ఉందని, మహిళల విషయంలో ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.






