మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సీఈఆర్ క్లబ్లో ఆదివారం జిల్లాస్థాయి పెన్కాక్ సిలాట్ పోటీలు ప్రారంభమయ్యాయి.
ఈ పోటీలను జిల్లా యువజన క్రీడల అధికారి హనుమంత్ రెడ్డి మరియు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అక్కల రమేష్ ప్రారంభించారు. సుమారు 100 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ప్రథమ స్థానాలు సాధించిన విద్యార్థులు ఈ నెల 14న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కానున్నారు. ఈ సందర్భంగా, హనుమంత్ రెడ్డి పెన్కాక్ సిలాట్ కేంద్ర ప్రభుత్వం గుర్తించిన క్రీడలలో ఒకటని తెలిపారు.
క్రీడలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం కొన్ని ఉద్యోగాల్లో రిజర్వేషన్ అవకాశాలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు.








