పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు ప్రకటించారు. 23 ఏళ్లుగా పోర్చుగల్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 41 ఏళ్ల రొనాల్డో, నవంబర్‌లో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌ల తర్వాత జాతీయ జట్టుకు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించారు.
పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు ప్రకటించారు. 23 ఏళ్లుగా పోర్చుగల్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 41 ఏళ్ల రొనాల్డో, నవంబర్‌లో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌ల తర్వాత జాతీయ జట్టుకు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించారు. తన కెరీర్లో పోర్చుగల్ తరఫున 234 మ్యాచ్‌లు ఆడి 146 గోల్స్ సాధించారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా, అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డులు సృష్టించాడు. 2016లో యూరో కప్, 2019, 2025లో నేషన్స్ లీగ్ టైటిళ్లు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

