మండలం కులబ్గూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సదాశివనగర్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద అనుమతులు లేకుండా నిర్మాణం చేపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంబేద్కర్ విగ్రహం సమీపంలో ప్రభుత్వ భూమి, రోడ్డు స్థలం ఉన్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు.
ఈ స్థలాన్ని కొందరు అక్రమంగా ఆక్రమించి నిర్మాణ పనులు చేపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురవుతున్నా.. అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల స్పష్టత కోరిన గ్రామస్తులు
నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా లేదా ప్రభుత్వ భూమిలోనే అక్రమంగా పనులు చేపడుతున్నారా అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూమి హద్దులు, నిర్మాణ అనుమతులపై సమగ్ర విచారణ చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.












