భీమారం, 6 July
తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల పెంపకం వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో భీమారం మండల కేంద్రంలో దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతి వేడుకలు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ సమక్షంలో ఘనంగా జరిగాయి. కొమురయ్య ఆశయ సాధనకు గొల్ల కురుమలు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో భీమారం మండల కేంద్రంలో దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ కూడా కొమురయ్య వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గొల్ల కురుమలందరూ దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి వేడుకల్లో తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సాయుధ పోరాటంలో తెలంగాణ ఉద్యమం కోసం వీరమరణం పొందిన తొలి అమరవీరుడు, గొప్ప మహనీయుడు కొమురయ్య ఆశయాలను ప్రతి ఒక్క గొల్ల కురుమలు సాధన కోసం కృషి చేయాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చిల్లారపు సంతోష్ యాదవ్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మండే మల్లేష్ యాదవ్, మండల గౌరవ అధ్యక్షులు వేల్పుల పర్వతాలు యాదవ్, ఎల్ఐసి ఏజీఎం రేషవేణి శ్రీనివాస్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి కేశవేణి సత్యనారాయణ యాదవ్, ఉపాధ్యక్షులు ధరవేణి తిరుపతి యాదవ్, కొమ్ము కుమార్ యాదవ్, కత్తర్ల సాగర్ యాదవ్, శివా యాదవ్, నాయకులు పాల్గొన్నారు.







