మందమర్రి పట్టణంలో మాజీ ఆర్మీ జవాన్ రాజేష్ పీవ్ హల్, రాణి పీవ్ హల్ దంపతులు 1857 సిపాయిల తిరుగుబాటులో అమరులైన స్వాతంత్ర్య సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు.
వారి నివాసంలో జరిగిన కార్యక్రమంలో, దంపతులు 1857 తిరుగుబాటు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టమని, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరుల త్యాగాలను స్మరించుకోవడం మన కర్తవ్యమని అన్నారు.
10 మే 1857న మీరట్లో ప్రారంభమైన ఈ తిరుగుబాటు దేశవ్యాప్తంగా విస్తరించిందని, మంగళ్ పాండే, రాణి లక్ష్మీబాయి వంటి నాయకులు బ్రిటిష్ వారికి గట్టిగా ఎదురు నిలిచారని తెలిపారు.
ఈ తిరుగుబాటు భారతీయ సిపాయిల ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటమని, ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగింపునకు దారితీసిందని వివరించారు.
స్వాతంత్ర్య భారతదేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు.












