తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంపీగా, టీబీజీకేఎస్ అధ్యక్షురాలిగా పదవులు అనుభవించిన కవిత, 10 ఏళ్ల అధికారం తర్వాత ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని ఆయన అన్నారు.
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి సోమవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, కవిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఎంపీగా, టీబీజీకేఎస్ అధ్యక్షురాలిగా పదవులు అనుభవించిన కవిత, 10 ఏళ్ల అధికారం తర్వాత ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని ఆయన అన్నారు.
మంచిర్యాలలో జరుగుతున్న కాంగ్రెస్ అండర్ డ్రైనేజ్, విద్యుత్ ఆధునికరణ పనులపై స్పందిస్తూ, వర్షాకాలంలోపు పనులు పూర్తిచేయాలని, పూర్తికాకపోతే గుంతలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కాలేశ్వరం ప్రాజెక్ట్ గురించి కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చడంలో, పొలాలకు నీరందించడంలో, రిజర్వాయర్లు, పశువులకు, పక్షులకు నీటిని అందించడంలో ఘనత సాధించారని అరవింద్ రెడ్డి కొనియాడారు.
తన తండ్రిపై రాజకీయ యుద్ధం ఎందుకో, అధికారంపై ఇంత శాడిజం ఎందుకో అర్థం కావడం లేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని ఆయన తెలిపారు.












