మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 27
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సమాచార హక్కు చట్ట జాతీయ కార్యదర్శి తోట శ్రీనివాస్‌ను, ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజ్ ఘనంగా సన్మానించారు. ఆయన చేపట్టిన పారదర్శక సేవలను కొనియాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే ఆయుధమైన ఆర్టీఐ చట్టాన్ని ప్రజలకు బలంగా సహకరించినందుకు అభినందనలు తెలిపారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సమాచార హక్కు చట్ట జాతీయ కార్యదర్శి తోట శ్రీనివాస్‌ను, ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజ్ ఘనంగా సన్మానించారు. వివిధ సేవా కార్యక్రమాల్లో ఆయన చేపట్టిన పారదర్శక సేవలకు గాను ఈ సన్మానం చేశారు. శ్రీనివాస్ సేవలను చంటి ముదిరాజ్ కొనియాడారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ప్రశ్నించే ఆయుధంగా అందుబాటులో ఉండే ఆర్టీఐ చట్టాన్ని ప్రజలకు బలంగా సహకరించినందుకు గాను తోట శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి, ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేష్, సహాయ కార్యదర్శి అన్నవరపు సందీప్, రాష్ట్ర నాయకులు గడప కృష్ణ ప్రకాష్ రావు, చిందం రఘు చందర్, కమటం రమేష్ తదితరులు పాల్గొన్నారు.











