నూతనంగా జిల్లా రిజిస్ట్రార్‌గా నియమితులైన సందీప్ కుమార్ గురువారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, నూతన రిజిస్ట్రార్ సందీప్ కుమార్‌కు అభినందనలు తెలిపారు.
నూతనంగా జిల్లా రిజిస్ట్రార్‌గా నియమితులైన సందీప్ కుమార్ గురువారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, నూతన రిజిస్ట్రార్ సందీప్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, వృత్తిపట్ల అంకితభావంతో పని చేయాలని సూచించారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ, రిజిస్ట్రేషన్ శాఖ సేవలను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం వేగంగా అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.


