మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 31
చభఆైృదేహదదేణ14జొేేచేొఢజే.ణేేొ.
గట్టయ్య మరణం బాధాకరమని ఆ కుటుంబానికి తీరని లోటు అని మేయర్ ధరణి మధుకర్ అన్నారు. 14వ డివిజన్ కార్పొరేటర్ నరేష్‌తో కలిసి మేయర్ మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అసిస్టెంట్ లైన్మెన్ గట్టయ్య మృతదేహం వద్దకు చేరుకొని ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వృత్తిని ధర్మంగా భావించి పట్టణ ప్రజలతో మమేకమై తన సేవలను అందించే సందర్భంలో జరిగిన ప్రమాదం ద్వారా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారని తెలిపారు. శాఖ పరంగా రూ.1.15 కోట్ల ఎక్స్ గ్రేషియా, నాతోపాటు ఇతర ప్రయోజనాలు అందజేస్తూ, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాన్ని త్వరితగతిన అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గట్టయ్య కుటుంబ సభ్యులతో పాటు విద్యుత్ శాఖ ఉద్యోగుల సంఘం నాయకుడు బొమ్మ సత్తిరెడ్డి, తోటి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.










