జైపూర్, జులై 30
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సంప్రదించండి: జైపూర్ ఎస్ఐ భూమేష్సంప్రదించండి:జైపూర్ఎస్ఐభూమేష్ జైపూర్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) భూమేష్ సూచించారు. వరద సహాయం కోసం 'డైల్ 100' నిసహాయంకోసం'డైల్100'ని నీరు రోడ్లపైకి చేరడంతో పోలీసులు పలు మార్గాలను మూసివేశారు. గోదావరి నది, స్థానిక చెరువులు, ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.
పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని జైపూర్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) భూమేష్ హెచ్చరించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీరు రోడ్లపైకి చేరడంతో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఆయా మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ యంత్రాంగం, స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుత పరిస్థితులపై జైపూర్ ఎస్ఐ మాట్లాడుతూ.. గోదావరి నదితో పాటు స్థానిక చెరువులు, వాగులు, ప్రాజెక్టుల్లో నీటి మట్టం వేగంగా పెరుగుతోందని, ప్రజలు ముఖ్యంగా యువత వాటి వద్దకు వెళ్లకూడదని స్పష్టం చేశారు.
జలాశయాలకు దూరంగా ఉండాలి: గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చెరువులు, ప్రాజెక్టుల వద్దకు వెళ్లడం పూర్తిగా నిషిద్ధం. తల్లిదండ్రుల పర్యవేక్షణ: పిల్లలు, యువకులు వరద నీటి వద్దకు చేరకుండా తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా సెల్ఫీలు దిగడం, ఈత కొట్టడం వంటి సాహసాలు చేయనివ్వకూడదు. పరిమిత వేగంతో ప్రయాణాలు: వర్షం నీటి వల్ల రోడ్లపై వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వాహనదారులు పరిమిత వేగంతో, జాగ్రత్తగా ప్రయాణించాలి. విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్త: వర్షాల సమయంలో కరెంట్ స్తంభాలు (పోల్స్), ట్రాన్స్ఫార్మర్లు మరియు ఇతర విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలి.
విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలందించడానికి జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉన్నారని ఎస్ఐ భూమేష్ భరోసా ఇచ్చారు. వరద సహాయం లేదా ఏదేని అత్యవసర పరిస్థితి ఎదురైతే ప్రజలు వెంటనే Dial 100 కి లేదా స్థానిక పోలీస్ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.











