మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 27
ంచయషంటటఎదంటయషంచోూౌశభయంఘంధంఅందంచ.ఉదయోభద,యధథం,షందంటఅంశైఈోంచ.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మిక సంఘం తరఫున కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. గత తొమ్మిది నెలలుగా అనేక ఇబ్బందులు పడుతున్న కార్మికులను దృష్టిలో ఉంచుకొని, 60 ఏళ్లు పైబడిన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి, చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి, అనారోగ్యంతో డ్యూటీ చేయలేని కార్మికుల స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు.
విజ్ఞప్తి మేరకు శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తక్షణమే స్పందించి, కార్పొరేషన్ కమిషనర్, మేయర్ లకు ఫోన్ చేసి కార్మికులను డ్యూటీలో తీసుకోవాలని ఆదేశించారు. జీవో నెంబర్ 69 ప్రకారం కార్మికుల వేతనాలు వెయ్యి రూపాయలు తగ్గించాలని సీడీఎంఏ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో, మట్టి విషయంపై కార్మికుల వేతనాలు యధావిధిగా కొనసాగించాలని కోరారు. ఎమ్మెల్యే గారిని కోరిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి, పాత పద్ధతిలోనే వేతనాలు ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఇవన్నీటిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గారికి మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మిక సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా, కార్మికులకు వర్షాకాలం దృష్ట్యా దుస్తులు, రెయిన్ కోట్లు ఇవ్వాలని కోరుతూ ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్ కు మెమోరాండం అందజేశారు. ఈ సమస్యలపై గౌరవ అధ్యక్షులు శుద్ధమల హరికృష్ణ మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సాగర్, శ్రీనివాస్, కోకిల, సది కుంటాల రాయమల్లు, కుమార్, వెంకటేష్, ఆవుల శ్రీనివాస్, సుధాకర్, రాజేశం, వెంకటి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.












