మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 17
ంచినసికొషన17డిినగడిటగనికిచెంిననసిినెంటకికడచికతిఅంకఅనోగంతోనిననతి10గంటసంోతిశసిడిచ.ఆనఅంించినసనసించకంటూఅధిక,తినిధ సంతంతెి.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ గుడి పేట గ్రామానికి చెందిన మున్సిపల్ పర్మినెంట్ కార్మికుడు చిప్పకుర్తి అంకులు అనారోగ్య కారణాలతో నిన్న రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందారు. ఆయన మున్సిపాలిటీకి ఎన్నో సేవలందించారు.
ఈరోజు వారి స్వగృహంలో అంకులు పార్థివ దేహానికి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, 17వ డివిజన్ కార్పొరేటర్ లగిసెట్టి రాజయ్య, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, అసిస్టెంట్ కమిషనర్ రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ వైకుంఠం గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి, మున్సిపాలిటీకి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్‌తో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.










