సంగారెడ్డి, 2026-08-24
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదు, వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు సంగీత, పాండు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదు, వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు సంగీత, పాండు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల సమన్వయంతో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
మండల స్థాయిలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్లు సూచించారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా మొత్తం 57 ఫిర్యాదులు, వినతులు అందాయి. వీటిలో కలెక్టరేట్లో 37, సంగారెడ్డి డివిజన్లో 13, జహీరాబాద్ డివిజన్లో 3, నారాయణఖేడ్ డివిజన్లో 4 ఫిర్యాదులు, వినతులు అందాయి. అందోల్ డివిజన్లో ఎలాంటి ఫిర్యాదులు, వినతులు అందలేదు.
ప్రజావాణిలో అందిన వినతుల్లో ప్రధానంగా రెవెన్యూ, హౌసింగ్, పెన్షన్లు, పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ మండలి, పోలీస్, ఈఈపీఆర్, మున్సిపల్, ఇంటర్మీడియట్, ఎంప్లాయ్మెంట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమం తదితర శాఖలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి.
ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి దరఖాస్తు పరిష్కారానికి తీసుకున్న చర్యలను సంబంధిత రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.












