Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 30
హాజీపూర్ మండలంలోని శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, కడెం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నేపథ్యంలో గోదావరిలో ప్రవాహం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.
హాజీపూర్ మండలం పరిధిలోని శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ ఈ. రవీంద్ర చారి సూచించారు.
కడెం ప్రాజెక్టు నుంచి వరద నీటిని విడుదల చేయడంతో పాటు, ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రజలు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు నది ఒడ్డున, వరద ప్రవాహ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూచించారు.










