పోలీసు శాఖలో అవినీతి, అక్రమ సంపాదనలపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంగార్డ్స్ నుంచి ఐపీఎస్ అధికారుల వరకు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, యూనిఫామ్ ధరించినప్పుడు అవినీతి ఆలోచనలకు తావు ఇవ్వరాదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో కొందరు పోలీసు సిబ్బంది ACB దాడుల్లో పట్టుబడటంతో డీజీపీ ఈ హెచ్చరికలు చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాల్సిన పోలీసులే అక్రమ సంపాదనకు అలవాటు పడితే వ్యవస్థకు తీరని నష్టం జరుగుతుందని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. యూనిఫామ్ గౌరవాన్ని కాపాడుకోవాలని, బాధ్యతలను మరచి దారితప్పితే ACB అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు.
పోలీసుల లక్ష్యం 'ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్' గా ఉండాలని, ఈ స్ఫూర్తితోనే ప్రజలకు సేవ చేయాలని ఆయన సూచించారు. నిజాయితీతో విధులు నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల కాలంలో పోలీసు సిబ్బంది ACB దాడుల్లో పట్టుబడటం, ఈ ఘటనలు పోలీసు శాఖ ప్రతిష్టను మసకబార్చడం వంటి పరిణామాల నేపథ్యంలో డీజీపీ ఈ కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. అందరూ బాధ్యతతో పనిచేయాలని ఆయన సూచించారు.
అవినీతిని ఏమాత్రం సహించేది లేదని, చట్టాన్ని గౌరవించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డీజీపీ పోలీసు సిబ్బందికి సూచనలు ఇచ్చారు.






