సంగారెడ్డి, 2026-08-25
ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి () ఆధ్వర్యంలో ఈ నెల 27న సంగారెడ్డిలో మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ నిరసనకు చైర్మన్ మహమ్మద్ జావీద్ అలీ, సెక్రటరీ జనరల్ వైద్యనాథ్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి () ఆధ్వర్యంలో ఈ నెల 27న నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని చైర్మన్ మహమ్మద్ జావీద్ అలీ, సెక్రటరీ జనరల్ వైద్యనాథ్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ నెల 27న గురువారం ఉదయం 10గంటలకు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
మంగళవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగులను కలిసి మహాధర్నా ఉద్దేశాలు, ప్రధాన డిమాండ్లను వివరించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సీపీఎస్ ఉద్యోగులు, పెన్షనర్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు, వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు.
ఉద్యోగుల మహాధర్నాలో ప్రధానంగా ఐదు కీలక డిమాండ్లను నాయకులు ప్రస్తావించారు. అవి: 1. 2వ ని వెంటనే అమలు చేయాలి. 2. పెండింగ్లో ఉన్న 6 విడతల , లను వెంటనే విడుదల చేయాలి. 3. సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం ()ను పునరుద్ధరించాలి. 4. నెలకు రూ.2,000 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి. 5. నూతన ను సక్రమంగా అమలు చేయాలి అని వారు తెలిపారు.
ఉద్యోగుల ఐక్యతే తమ డిమాండ్ల సాధనకు ప్రధాన బలమని నాయకులు పేర్కొన్నారు. ప్రతి కార్యాలయం నుంచి ఉద్యోగులు సమన్వయంతో తరలివచ్చి మహాధర్నాలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులందరూ ఏకతాటిపైకి వచ్చి తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ సెక్రటరీ వేల్పూరు రవి, అసోసియేట్ అధ్యక్షుడు కసిని శ్రీకాంత్, కోశాధికారి శ్రీనివాస్, టీజీవో సెక్రటరీ సంతోష్, ప్రమోద్, వేణు, శ్యాంసుందర్, శ్రీనివాస్, శాంతికుమార్, రమేష్, నాగేశ్వరరావు, యాదవరెడ్డి, షరీఫ్, నాగరాజు, గోపాల్ తదితర నాయకులు పాల్గొన్నారు.












