మండలంలోని పలు గ్రామాల్లో క్రేజీ వీల్స్ అమర్చిన ట్రాక్టర్ల సంచారం పెరిగిపోవడంతో రహదారులు ధ్వంసమవుతున్నాయి. పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు ఈ సమస్యను పట్టించుకోవడం లేదని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. ప్రజాధనంతో నిర్మించిన రోడ్లు కొద్దికాలంలోనే పాడవుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లోని బీటీ, సిమెంట్ రోడ్లపై క్రేజీ వీల్స్‌తో ట్రాక్టర్లను ఇష్టానుసారంగా నడుపుతుండటంతో రహదారులు దెబ్బతింటున్నాయి. దీనివల్ల కొద్దికాలంలోనే రోడ్లు పాడైపోతున్నాయని, ఇది ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పరిరక్షణ బాధ్యత కలిగిన గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాక్టర్ల యజమానులు నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నా, వారిని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, క్రేజీ వీల్స్‌తో రోడ్లను ధ్వంసం చేస్తున్న ట్రాక్టర్లపై నిఘా పెట్టాలని, రహదారుల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ సమస్యపై తక్షణమే స్పందించి రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


