జిల్లా కేంద్రంలో పండగ వేళ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. పండగ షాపింగ్ కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పాటు, కొనసాగుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ ఆధునికీకరణ పనుల కారణంగా రోడ్లు మూసివేయడంతో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారు.
జిల్లా కేంద్రంలో పండగ వచ్చిందంటే చాలు ట్రాఫిక్ కష్టాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పండగ షాపింగ్‌తో మార్కెట్లకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు రూ. మార్కెట్లో చేపట్టిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ ఆధునికీకరణ పనుల కారణంగా రోడ్ల తవ్వకాలు, జేసీబీలతో పనులు కొనసాగుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమైంది.
సుమారు 1.40 లక్షల జనాభా కలిగిన పట్టణంలో ప్రధాన కూడళ్ల వద్ద వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా ముక్రం చౌరస్తా నుంచి టూ టౌన్, వన్ టౌన్ ప్రాంతాలకు వెళ్లే మార్గంలో నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. పండగ వేళ పరిస్థితి మరింత దారుణంగా మారి వాహనదారుల మధ్య వాగ్వాదాలు ఘర్షణలు ప్రమాదాలకు దారితీస్తోంది.
పెరుగుతున్న జనాభా విస్తరిస్తున్న వ్యాపార కార్యకలాపాలకు అనుగుణంగా రహదారుల అభివృద్ధి జరగకపోవడం పట్టణ ప్రజలకు శాపంగా మారింది. ముఖ్యంగా గాంధీనగర్ హైటెక్ సిటీ ప్రాంతాల మీదుగా రైల్వే ఫ్లైఓవర్ నిర్మిస్తే ట్రాఫిక్ ఒత్తిడిని కొంతమేర తగ్గించవచ్చని పట్టణవాసులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర మంత్రి ఎంపీ ముఖ్యంగా ఎమ్మెల్యే స్పందించి ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పండగ వచ్చిందంటే ట్రాఫిక్‌లో నరకం అనుభవించాల్సిన పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.












