Srikakulam/Lakshminarasupeta (అక్షరవేకువ) ఆగస్టు 01
హాజీపూర్ మండలంలో పెండింగ్లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరాను ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వి. రాములు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన హాజీపూర్ మండలంలోని పలు రైస్ మిల్లులను తనిఖీ చేశారు.
పెండింగ్లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరాను ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వి. రాములు సూచించారు.
శుక్రవారం హాజీపూర్ మండలం ఎస్.ఆర్.ఎం. రైస్ మిల్లులను మండల ఆర్.ఐ.తో కలిసి తనిఖీ చేసి, సీఎంఆర్ పురోగతిపై ఆయన ఆరా తీశారు.
కేటాయించిన లక్ష్యం మేరకు సీఎంఆర్ ను సకాలంలో అందజేయాలని, నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.












