మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 26
మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం మంచిర్యాలలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొని నూతన పాలకవర్గాన్ని అభినందించారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో నూతన మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్గా రామగిరి బానేష్, వైస్ చైర్మన్గా జాలే రాయలింగు, డైరెక్టర్ల సభ్యులందరినీ అభినందించి, శాలువాలతో సన్మానించి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా, మార్కెట్ యార్డుల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల విశ్వాసాన్ని నిలబెట్టేలా పారదర్శకంగా పనిచేసి మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ, రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతన పాలకవర్గానికి సూచించారు.
మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గార్లు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారిని, సురేఖమ్మ గారిని గజమాలతో, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం, మార్కెట్ కమిటీ జిల్లా అధికారులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల జిల్లా RTA మెంబర్ అంకతి శ్రీనివాస్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల జిల్లా RGPRS గడ్డం త్రిమూర్తి, ఆత్మ కమిటీ ఛైర్మన్ సింగితి మురళి, లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, జిల్లా OBC అధ్యక్షులు ఒడ్డే రాజమౌళి, జిల్లా నాయకులు నాగభూషణం, మంచిర్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ మహిళా అధ్యక్షురాలు గజ్జల హేమలత, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, రైతులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.











