నగరంలో (అక్షరవేకువ) ఆగస్టు 27
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్లో నెలకొన్న సమస్యలపై స్థానికులు గురువారం డివిజన్ సభలో అధికారులకు విన్నవించారు. పారిశుద్ధ్య సమస్య, వీధి దీపాల వెలగకపోవడం వంటి అంశాలపై దృష్టి సారించాలని కోరారు.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్లో నెలకొన్న సమస్యలపై స్థానికులు గురువారం డివిజన్ సభలో అధికారులకు విన్నవించారు. గ్రామసభలో పలు సమస్యలపై వెంటనే పరిష్కారం చూపాలని, ప్రధాన సమస్యలను పరిష్కరించాలని వినతి చేశారు.
ప్రధాన సమస్యలు
పారిశుద్ధ్య సమస్యతో పాటు, పలు కాలనీల్లో వీధి దీపాలు వెలగడం లేదని తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని కార్పొరేటర్ గాజుల ముఖేష్ గౌడ్ సూచించారు.












