మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 26
మండిపడ్డ బిజెపి రఘునాథరావుచభతఆసతెొణసథతబజెఉధఘథతీరుపై మండిపడ్డసచ.,సబబఅసతమండిపడ్డఆఆచ.ఆసతససేఅడేమండిపడ్డచ.
మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం రోగుల పాలిట శాపంగా మారాయని, రోగుల సంఖ్యకు తగినట్లుగా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో సరైన వైద్య సేవలు అందడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఆసుపత్రిలో గోడలు పగుళ్లు తీయడం, నీళ్లు లీక్ అవ్వడం, గదులు దుర్వాసనతో నిండిపోవడం వంటి సమస్యలతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరికరాల కొరత, వైద్యుల కొరతతో పాటు సిబ్బంది నిర్లక్ష్యం ప్రజలను మరింత కష్టాలపాలు చేస్తోందని, కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఎమ్మెల్యేలు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు రావడానికి భయపడే పరిస్థితి ఏర్పడిందని తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు ప్రభుత్వం తీరును తీవ్రంగా విమర్శించారు.
వైద్యంపై ప్రభుత్వం వైఫల్యం
తెలంగాణలో మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ సందర్శించారు.












