మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 25
జాతీయ నేత్రదాన వారోత్సవాలను పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలోన్స్ క్లబ్బ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు నిర్వహించే జాతీయ నేత్రదాన వారోత్సవాలను మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కూడా భాగస్వాములయ్యారు.
ముఖ్య అతిథిగా
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీ నరేంద్ర రాథోడ్ () హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం చైర్మన్ లయన్ వి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, నేత్రదానంపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. మరణానంతరం వృధాగా మట్టిలో కలిసే నేత్రాలను దానం చేయడం ద్వారా ఇద్దరికి చూపును ప్రసాదించవచ్చని, తద్వారా వారు ప్రపంచాన్ని చూసే మహత్తర అవకాశాన్ని కల్పించిన వారవుతారని విజ్ఞప్తి చేశారు.
వైద్యుల సూచనలు
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్ ఇంచార్జ్ డాక్టర్ అశోక్ కుమార్, ఆర్ ఎం ఓ డాక్టర్ శ్రీధర్, ఆప్తమాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గీతాంజలి, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ మరియు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ శిల్ప పాల్గొని నేత్రదానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. చూపు లేని వారికి నేత్రదానం ద్వారా చూపును ప్రసాదించే కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా 15 రోజులపాటు కొనసాగుతుందని తెలియపరిచారు.
కరపత్రాల విడుదల, ప్రతిజ్ఞ
తదుపరి ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు లైన్స్ క్లబ్ వారి కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ప్రజలతో నేత్రదాన ప్రతిజ్ఞను చేయించారు.












