సంగారెడ్డి, 2026-08-25
క్షయవ్యాధి () నియంత్రణలో భాగంగా ప్రతి సిబ్బంది సమన్వయంతో పని చేసి, వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.కె.లలితాదేవి సూచించారు.

మంగళవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు), ఇద్దరు (డేటా ఎంట్రీ ఆపరేటర్లు)కు నియంత్రణ చర్యలు, వ్యాధి గుర్తింపు, చికిత్స, రిపోర్టింగ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. లలితా దేవి మాట్లాడుతూ.. లక్షణాలను గుర్తించిన వెంటనే అనుమానితులను పరీక్షలకు పంపించాలని సూచించారు.
చికిత్స పొందుతున్న రోగుల వివరాలను సక్రమంగా నమోదు చేయడంతో పాటు - పోర్టల్లో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు.
కేసుల రిపోర్టింగ్ ను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.
నిర్మూలన లక్ష్యాన్ని సాధించేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు సమన్వయంతో పనిచేయాలని, ఒక్క కేసు కూడా నిర్లక్ష్యానికి గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని డా.లలితాదేవి పేర్కొన్నారు.