మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 26
ప్రస్తుతం మధుమేహం కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ నేఫ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ వైద్యులు ప్రణిత్ రామ్ సూచించారు. బుధవారం మంచిర్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు.

కిడ్నీ సమస్యల సూచనలు
కిడ్నీల పనితీరులో మార్పులను సూచించే లక్షణాలను గమనించాలని ఆయన తెలిపారు. కాళ్లు వాపు, కళ్లు మసకబారడం, శరీరంలో మార్పులు, రాత్రి వేళల్లో అసాధారణంగా మూత్ర విసర్జన వంటి సూచనలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
చికిత్స విధానాలు
ప్రథమ చికిత్సగా వైద్యుల పరీక్షలు తప్పనిసరి అని, తదుపరి ఔషధాలతో పాటు ఇతర చికిత్సలతో సమస్య నయం కాకపోతే, కిడ్నీ మార్పిడి (అమరిక) చేయాల్సి ఉంటుందని ప్రణిత్ రామ్ పేర్కొన్నారు. ఈ అమరిక ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు.
అందుబాటులో వైద్యం
కిడ్నీ సంబంధిత వైద్యం పేద, మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ ఇన్చార్జి మేనేజర్ అంకం మల్లేష్ పాల్గొన్నారు.