జిల్లాలో ప్రజా పాలన మరింత మెరుగ్గా కొనసాగాలని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కోరారు. కలెక్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా ఈ విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో ప్రజా పాలన మరింత మెరుగ్గా కొనసాగాలని టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ఆకాంక్షించారు. పేద, బడుగు వర్గాలతో పాటు జర్నలిస్టుల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆయన కోరారు. టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ఆధ్వర్యంలో జర్నలిస్టులు శనివారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో కలిసిన సందర్భంగా, కలెక్టర్‌కు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. కలెక్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఏ అండ దండా లేని పేద ప్రజలకు పెద్దదిక్కుగా ఉండాలని వారు కోరారు. అందుకు తగిన ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా, జిల్లాలో జర్నలిస్టులకు తోడుగా ఉండాలని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని ఆయన పేర్కొన్నారు. దీనికి జిల్లా కలెక్టర్ మనస్ఫూర్తిగా స్పందించారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా ఉపాధ్యక్షుడు మతిన్, సీనియర్ జర్నలిస్టు మసూద్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ విల్సన్, చిన్న మధ్యతరహా పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్ధిక్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చవాన్, కోశాధికారి లక్ష్మణ్, ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఆరిఫ్, జర్నలిస్టులు సూర్య వెంకట్, దినేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.












