చించొలి(బి) (అక్షరవేకువ) జూలై 08
సంపూండంచించొి(బి)ంసతుతనివహించినసవేశంనిూసీఐఎం.కృషణపొనను.భదతదృషటయసీసీటీవీకెెపుఖయతనుఆయనవివించు.వయపసంసథుకూడతపపనిసివీటినిఏపటుచేసుకవనిసూచించు.
సారంగాపూర్ మండలం చించొలి(బి) గ్రామంలో నిర్మల్ రూరల్ సీఐ ఎం. కృష్ణ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, గ్రామ భద్రత కోసం సీసీటీవీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి దుకాణ, వ్యాపార సంస్థల యజమానులు వారి వారి పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
వెంటనే గ్రామ సర్పంచ్ సాయన్న, గ్రామ అభివృద్ధి కమిటీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. అనంతరం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో కలిసి అరె మైసమ్మ దేవాలయం వద్ద మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో సారంగాపూర్ ఎస్ఐ శ్రీకాంత్, చించొలి(బి) గ్రామ సర్పంచ్ సాయన్న, ఉప సర్పంచ్ పోశెట్టి, పంచాయతీ కార్యదర్శి సౌజన్య, గ్రామస్తులు పాల్గొన్నారు.












