మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 26
-ఉ-బపవపకకపటటణవహ.ఈబెపౌతవకపడ,వటపపణేశ.
మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలో ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి చౌరస్తా వద్ద ముస్లిం సోదరులకు పండ్లు, వాటర్ పంపిణీ చేశారు.
ప్రముఖుల భాగస్వామ్యం
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు, కార్పొరేటర్ ఖలీద్, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పూదరి తిరుపతి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, పీసీసీ సభ్యులు, నస్పూర్ పట్టణ ఇంఛార్జి నూకల రమేష్, అబ్దుల్ జలీల్, మినహాజ్ హుస్సేన్, మహమ్మద్ గౌసుద్దీన్, మక్బూల్ హుస్సేన్, మాజీ కౌన్సిలర్ మినహాజ్, పర్వేజ్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శుభాకాంక్షలు
అనంతరం ముస్లిం సోదర, సోదరీమణులందరికీ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపారు.












