మందమర్రి పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో రేపు, 11.04.2026 శనివారం, విద్యుత్ సరఫరాలో తాత్కాలిక అంతరాయం ఏర్పడనుంది. అందుగుల పేట సబ్ స్టేషన్లో నిర్వహించనున్న నిర్వహణ పనుల కారణంగా ఈ అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
ఉదయం 9:30 గంటల నుండి 11:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ సమయంలో అనేక ప్రాంతాలు ప్రభావితం కానున్నాయి.
GM ఆఫీసు, యాపల్, కేకే 2, మందమర్రి ఊరు, టోల్ ప్లాజ, మార్కెట్, దీపక్ నగర్, పాలచెట్టు, దొరల బంగ్లా, రామకృష్ణ పూర్ ఊరు, కాళీ క్యాంప్, పులి మడుగు, అడుగుల పేట, కోటేశ్వరరావు పల్లి, బొక్కల గుట్ట, నార్ల పూర్ మరియు సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో విద్యుత్ ఉండదు.
విద్యుత్ వినియోగదారులు ఈ తాత్కాలిక అసౌకర్యానికి సహకరించాలని విద్యుత్ శాఖ సహాయ ఇంజనీర్ (AE) మందమర్రి కోరారు. నిర్వహణ పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతుంది.







