రాపన్ పల్లి (అక్షరవేకువ) ఆగస్టు 24
కోటపల్లి మండలంలోని రాపన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు, గ్రామ సర్పంచ్ అట్టెల ప్రభాకర్ ఆధ్వర్యంలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అర్హులైన గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా రేషన్ స్మార్ట్ కార్డులను అందజేశారు.

సంక్షేమ పథకాల అమలు
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తామని గ్రామ సర్పంచ్ అట్టెల ప్రభాకర్ తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, గ్రామ అభివృద్ధే ధ్యేయంగా రాపన్ పల్లి గ్రామ పంచాయతీ ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో కొమురయ్య, మండల కోఆర్డినేటర్ రాళ్లబండి అనిల్, గ్రామ యువత, మహిళలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.