కండి, 2023-08-23
కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతోందని అన్నారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, పేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్లు నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఆమె చెప్పారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచందర్ నాయక్, కంది మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ మొగులయ్య, మోతిలాల్ నాయక్, సర్పంచ్ శంకరి రాజు, ఉప సర్పంచ్ కొన్యాల లావణ్య రాజేందర్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.