సంగారెడ్డి, 2026-08-22
బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చలనచిత్రం ప్రత్యేక ప్రదర్శన సంగారెడ్డి పట్టణంలో జరగనుంది. ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు రుక్మిణి థియేటర్లో ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.
బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చలనచిత్రం ప్రత్యేక ప్రదర్శన సంగారెడ్డి పట్టణంలో జరగనుంది. ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు రుక్మిణి థియేటర్లో ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా శనివారం రుక్మిణి థియేటర్ వద్ద చిత్ర ప్రత్యేక ప్రదర్శనకు సంబంధించిన వాల్ పోస్టర్ను కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, జిల్లా ప్రచార కార్యదర్శి వెంకటేష్ గౌడ్, రుక్మిణి థియేటర్ మేనేజర్ కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేసే ఈ చలనచిత్రాన్ని బహుజనులు, గౌడ సోదరులు, గీత కార్మికులు, ప్రజలందరూ తప్పక వీక్షించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక ప్రదర్శనకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు. సినిమా టికెట్ల కోసం 9493601257, 9440516179 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.











