పారుపల్లి (అక్షరవేకువ) ఆగస్టు 09
ప్రకృతితో మమేకమై జీవించే గిరిపుత్రుల ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని పారుపల్లి గ్రామంలో ఆదివాసీ కాలనీ వాసులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఎగరవేసే కార్యక్రమం జరిగింది.
ప్రాచీన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, నిరాడంబరతకు నిలువుటద్దంగా నిలిచే జీవనశైలి ఆదివాసుల సొంతం. ప్రకృతిమాత బిడ్డలైన గిరిపుత్రుల ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా పారుపల్లి గ్రామంలోని ఆదివాసీ కాలనీ వాసులతో కలిసి జెండా ఎగరవేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, కుల పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
సర్పంచ్ తోగరు శ్రీనివాస్
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తోగరు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆదివాసీల జీవన విధానాన్ని, వారి సంస్కృతిని కొనియాడారు. ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసీల సంప్రదాయాలు ఎంతో గొప్పవని తెలిపారు.








