మంచిర్యాల (అక్షరవేకువ) అక్టోబర్ 15
35 రోజుల వయస్సుతో కల్తీ కల్లు అమ్మకాలను అరికట్టి 9 దుకాణాలను సీజ్ చేశారు, 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు
జిల్లా కేంద్రంలో కల్తీ కల్లు అమ్మకాలను అరికట్టి 35 రోజులు కావస్తోంది. ఎక్సైజ్, నార్కోటిక్, టాస్క్ ఫోర్స్ శాఖల సంయుక్త ఆపరేషన్ లో భాగంగా 9 దుకాణాలను సీజ్ చేశారు. ఈ కేసుల్లో 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దుకాణాలలో నెలకొనున్న ప్రమాద రసాయనాల కల్తీ మేరకు పలువురు ఇచ్చిన సమాచారంతో తెల్ల కల్లు బట్టీల నిర్వాహకులు కల్తీ కల్లును విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే సమాచారం మేరకు, అధికారులు తనిఖీలు నిర్వహించి నమూనాలను ప్రయోగశాలలకు పంపారు. వాటిలో క్లోరోఫామ్, డైజోఫాం, ఆల్ఫాజోలం కలిపినట్లు నిర్ధారణ కావడంతో ఈ కేసుల పరంపర కొనసాగింది.
వీటిలో, మానవ నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ఆల్ఫాజోలం అత్యంత ప్రమాదకరమైన రసాయనంగా గుర్తించి, 9 దుకాణాల నిర్వాహకులపై కేసు నమోదు చేసి, లక్షల రూపాయల జరిమానాతో కోర్టులో రిమాండ్ కు తరలించారు. ఈ రసాయనాలు కలిపిన కల్లు సేవించడం వల్ల అలవాటుపడిన మత్తు ప్రియులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఈ మందుల ప్రభావం లేని సమయంలో, కాళ్లు చేతుల్లో కదలికలకు ఇబ్బందులు వస్తున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా కల్తీ మద్యం విక్రయించడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.











