ఆదిలాబాద్ జిల్లా మావలలో ఆయుధాలతో వీడియోలు చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కేఆర్కే కాలనీకి చెందినవారిగా గుర్తించారు.
కేఆర్కే కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆయుధాలను ప్రదర్శిస్తూ వీడియోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చర్యల ద్వారా ప్రజల్లో భయభ్రాంతులను సృష్టించినట్లు సమాచారం. ఈ విషయంపై సమాచారం అందుకున్న మావల ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, భయాందోళనలు సృష్టించడం చట్టరీత్యా నేరమని తెలిపారు.












