Mancherial/Jaipur (అక్షరవేకువ) జూలై 13
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామంలో గోశిక మాధవి అనే యువతి సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడిన వెంకటేశ్ అనే యువకుడి వల్లే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామంలో గోశిక మాధవి అనే యువతి సోమవారం ఆత్మహత్య చేసుకుంది. అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నందునే మాధవి ఈ విపరీత నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జైపూర్ ఎస్సై భూమేశ్ కేసు నమోదు చేసుకున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు గల పూర్తి వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు.












