మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 13
ఆచియాలపభతవఆసపతిియఆజిఆకేోిటేకఆటోఆణఆకఆటోపేఆపేతోవేిపకగైఓయవతిబిటేకఆటోపగఆసేవిిఆతఆహతయేసకి.ఈఘటతోఆగహిికటసభయ,వఆియఆపభతవఆసపతివఆసపతిఆఆేపటటఆ.ిితడిిఅెసటేయఆిడిఆఆడేశఆ.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టేకుమట్లలో సోమవారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులకు గురైన ఓ యువతి పురుగుమందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. ఈ ఘటనలో నిందితుడిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
టేకుమట్ల గ్రామానికి చెందిన గోశిక మాధవి (26)ని అదే గ్రామానికి చెందిన గోనే వెంకటేష్ వేధిస్తున్నట్లు మాధవి బంధువులు తెలిపారు. భూపాలపల్లిలో సింగరేణి ఉద్యోగం చేస్తున్న వెంకటేష్, మాధవిని ప్రేమ పేరుతో వెంటపడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. వెంకటేష్ వేధింపుల కారణంగానే ఆదివారం రాత్రి మాధవి పురుగుమందు సేవించి అస్వస్థకు గురైంది.
అస్వస్థతకు గురైన మాధవిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. నిందితుడిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల సిఐ ప్రమోద్ రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












