సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఆదివారం జిల్లా అధ్యక్షుడు ఎండీ. జావిద్ అలీ, సీఐ రాము నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ ఎండీ. సోహెల్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా అధ్యక్షుడు ఎండీ. జావిద్ అలీ, సీఐ రాము నాయుడు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎండీ. జావిద్ అలీ, సీఐ రాము నాయుడు, దాత ఎండీ. సోహెల్ స్వయంగా భక్తులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు అతిథులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









