సంగారెడ్డి జిల్లాలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ తరగతులు ఈనెల 12న (సోమవారం) ప్రారంభం కానున్నాయి. స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు తప్పనిసరిగా హాజరు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు.
ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్‌లో భాగంగా స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ ఈనెల 12న (సోమవారం) ఉదయం 9గంటలకు తమకు కేటాయించిన కేంద్రాల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని, అర్హత సాధించిన అభ్యర్థులు శిక్షణ తరగతులకు హాజరు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు వాట్సాప్ ద్వారా ఇదివరకే సమాచారం అందించడం జరిగింది. అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రాల్లో నిర్ణీత సమయానికి హాజరు తెలిపారు. నిరుద్యోగ యువతకు చేయూత అందించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకొని పట్టుదలతో చదివి ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించే దిశగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. కోచింగ్ కేంద్రాల వివరాలు: 1. సంగారెడ్డి కేంద్రం: అంబేద్కర్ భవన్, బైపాస్ రోడ్, సంగారెడ్డి. 2. జహీరాబాద్ కేంద్రం: ఆర్ఎల్ఆర్ స్కూల్, పస్తాపూర్, జహీరాబాద్. 3. అందోల్/జోగిపేట కేంద్రం: నెహ్రూ మెమోరియల్ డిగ్రీ కళాశాల, జోగిపేటలో కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు.








