జిల్లాలోని ఎఫ్ఎల్ఎన్ ( ) కాంపిటెంట్ స్కూల్స్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానంలో నిర్దేశిత అభ్యసన ఫలితాలను సాధించేలా సమగ్ర శిక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
జిల్లాలోని ఎఫ్ఎల్ఎన్ ( ) కాంపిటెంట్ స్కూల్స్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానంలో నిర్దేశిత అభ్యసన ఫలితాలను సాధించేలా సమగ్ర శిక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు, సీహెచ్ఎంలు, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎఫ్ఎల్ఎన్ కాంపిటెంట్ స్కూల్స్లో సమగ్ర శిక్షణ కార్యక్రమాల అమలు, పాఠశాలల పర్యవేక్షణ, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల అభ్యసన స్థాయులు తదితర అంశాలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎఫ్ఎల్ఎన్ పాఠశాలల పర్యవేక్షణను పటిష్టంగా నిర్వహించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పాఠశాలలను సందర్శించి విద్యా బోధన, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల అభ్యసన స్థాయులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరును ఎఫ్ఆర్ఎస్ ( ) ద్వారా క్రమం తప్పకుండా నమోదు కలెక్టర్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల ఎఫ్ఆర్ఎస్ హాజరుకు సంబంధించిన రోజువారీ నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరును అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. గైర్హాజరయ్యే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరై, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. వచ్చే సోమవారం నుంచి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఎఫ్ఆర్ఎస్ హాజరు స్పష్టంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎఫ్ఆర్ఎస్ హాజరులో ఎలాంటి అవకతవకలు, నిర్లక్ష్యం ఉండకూడదని, సంబంధిత అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాల ద్వారా ప్రతి విద్యార్థి తన తరగతి స్థాయికి అనుగుణంగా చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు కృషి సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఎంఈఓలు, సీహెచ్ఎంలు, ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో పని కలెక్టర్ సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాధికారి రోహిణి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు, ఎంఈఓలు, సీహెచ్ఎంలు, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.












