మండలం నందిగామ గ్రామంలో నూతనంగా నిర్మించిన గౌడ్ హాస్టల్ భవనాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన భవనాన్ని ప్రారంభించారు.
మండలం నందిగామ గ్రామంలో నూతనంగా నిర్మించిన గౌడ్ హాస్టల్ భవనాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడంలో గౌడ్ హాస్టల్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగించేందుకు ఇటువంటి వసతి గృహాలు దోహదపడతాయని తెలిపారు. నూతన భవనం అందుబాటులోకి రావడంతో విద్యార్థులకు వసతి పరంగా మరింత ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.












