సంగారెడ్డి జిల్లా మండలం నిజాంపూర్ కె పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోట్రు రామకృష్ణ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (పీఆర్టీయూ టీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు బిక్షం గౌడ్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
శుక్రవారం నల్గొండలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. సంఘ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మానయ్య, ప్రధాన కార్యదర్శి విట్టల్ రెడ్డి, మండల అధ్యక్షుడు ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి రమేష్తో పాటు రాష్ట్ర, జిల్లా, మండల కార్యవర్గ సభ్యులకు, పీఆర్టీయూ మిత్రులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.












