సారాంశం
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్- పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈనెల 24న నిర్వహించనున్న కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ టెస్ట్ () నేపథ్యంలో, రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. పరీక్షా కేంద్రం వద్ద చేపడుతున్న పోలీసు బందోబస్తు, అభ్యర్థుల రాకపోకల మార్గాలు, భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు.
ముఖ్య విషయాలు
- 1గీతం యూనివర్సిటీలో టీజీపీఎస్సీ పరీక్షా కేంద్రం: భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్- పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈనెల 24న నిర్వహించనున్న కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ టెస్ట్ () నేపథ్యంలో, రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు.
- 2పరీక్షా కేంద్రం వద్ద చేపడుతున్న పోలీసు బందోబస్తు, అభ్యర్థుల రాకపోకల మార్గాలు, భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు.
- 3ఈ సందర్భంగా, పరీక్షా కేంద్రం వద్ద చేపట్టనున్న పోలీసు బందోబస్తు, అభ్యర్థుల రాకపోకల మార్గాలు, పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న భద్రతా చర్యలను సమీక్షించారు.
- 4పరీక్షా కేంద్రం పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్- పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈనెల 24న నిర్వహించనున్న కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ టెస్ట్ () నేపథ్యంలో, రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. పరీక్షా కేంద్రం వద్ద చేపడుతున్న పోలీసు బందోబస్తు, అభ్యర్థుల రాకపోకల మార్గాలు, భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా, పరీక్షా కేంద్రం వద్ద చేపట్టనున్న పోలీసు బందోబస్తు, అభ్యర్థుల రాకపోకల మార్గాలు, పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న భద్రతా చర్యలను సమీక్షించారు.
పరీక్షా కేంద్రం పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
పరీక్షా నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఈ పర్యటనలో జిల్లా ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, ఇస్నాపూర్ ఇన్స్పెక్టర్, భానూర్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, మహేష్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, గీతం యూనివర్సిటీ యాజమాన్యం వర్మ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.