భారతదేశ అణుశక్తి రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేసే లక్ష్యంతో ఐఐటీ హైదరాబాద్ మరియు క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించిన అనుజ్ఞాన్ న్యూక్లియర్ టెక్నాలజీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ తొలి బ్యాచ్ విజయవంతంగా పూర్తయింది. ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణంలో మూడు నెలల పాటు పూర్తిస్థాయి వసతి సౌకర్యంతో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని 23 మంది ఇంజినీర్లు విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు వేడుకల్లో, శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఐఐటీ హైదరాబాద్ మరియు క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ సంయుక్తంగా ధ్రువపత్రాలను అందజేశారు. న ప్రారంభమైన 12 వారాల శిక్షణ కార్యక్రమం ముగింపు వేడుకలకు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ చైర్మన్ ఘనశ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో పద్మశ్రీ పురస్కార గ్రహీతలు డాక్టర్ చైతన్యమోయ్ గంగూలీ, డాక్టర్ చంద్రకాంత్ పిఠావా, బార్క్ రియాక్టర్ ప్రాజెక్ట్స్ గ్రూప్ మాజీ డైరెక్టర్ ఆర్.ఎస్. యాదవ్, అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ధీరజ్ పాండే, వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ సీనియర్ ఇండియా అడ్వైజర్ షా నవాజ్ అహ్మద్‌తో పాటు పలువురు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.
ఐఐటీ హైదరాబాద్ అధ్యాపకులు డాక్టర్ సౌరభ్ సందిల్య, ప్రొఫెసర్ భువనేశ్ రామకృష్ణ, క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ డైరెక్టర్ మరియు ప్రెసిడెంట్ (న్యూక్లియర్) కమోడోర్ ఆర్.డి. మానే (రిటైర్డ్), సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కమాండర్ బిను టామ్ జాకబ్ (రిటైర్డ్)తో పాటు పలువురు పాల్గొన్నారు.












