జైపూర్, 2026-07-08
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "బాల సభ" కార్యక్రమం మంగళవారం ఇందారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది. ఈ సభకు ఇందారం గ్రామ సర్పంచ్ మహమ్మద్ ఫయాజ్, ఉపసర్పంచ్ ఎల్కటూరి శివ సంయుక్తంగా అధ్యక్షత వహించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "బాల సభ" కార్యక్రమం మంగళవారం ఇందారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది.
ఈ సభకు ఇందారం గ్రామ సర్పంచ్ మహమ్మద్ ఫయాజ్, ఉపసర్పంచ్ ఎల్కటూరి శివ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహమ్మద్ ఫయాజ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. "నేటి బాలలే - రేపటి భారత పౌరులు" అని కొనియాడారు. విద్యార్థులు చిన్నతనం నుంచే ఉన్నతమైన ఆశయాలను కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.
సభలో భాగంగా విద్య, క్రీడల ప్రాముఖ్యత, స్వచ్ఛమైన త్రాగునీరు, పాఠశాల పరిసరాల పారిశుధ్యం, బాలల భద్రత, ఆరోగ్యం వంటి కీలక అంశాలపై పిల్లలతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ తన చిన్ననాటి స్కూల్ రోజుల అనుభవాలను, జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకుంటూ, వారి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేశారు.
ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు (హెచ్.ఎం), ఉపాధ్యాయ బృందంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
హాజరైన వారిలో వార్డు సభ్యులు ఆకుతోట లావణ్య చందు, మాడుగుల శంకర్, దగ్గుల రమేష్, ముక్త సంతోష్, గ్రామ కార్యదర్శి ప్రశాంత్, కారోబార్ బషీర్, సీనియర్ నాయకులు, జైపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ MD. జైనొద్దీన్, పాగల పున్నం యాదవ్, నల్లి శ్రీకాంత్, మరియు యువ నాయకులు చిప్పకుర్తి సతీష్ తదితరులు ఉన్నారు. పాఠశాల విద్యార్థులు ఈ సభలో చురుగ్గా పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.












